Karthika Deepam2 : కార్తీక్ పుట్టిన రోజున గుడిలో దీప.. నెక్లెస్ ఇచ్చాడంటూ జ్యోత్స్న బడాయి!
on Nov 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -209 లో.....జ్యోత్స్న కార్తీక్ బర్త్ డే అని కలిసి హగ్ చేసి విష్ చెయ్యాలి అనుకుంటుంది. అది కుదరకపోయేసరికి కనీసం ఫోన్ లో అయిన విష్ చెయ్ అని పారిజాతం సలహా ఇవ్వడంతో కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే కాంచన లిఫ్ట్ చేస్తుంది. బావకి ఇవ్వు విష్ చేస్తానని అనగానే.. ముందు హ్యాపీ మారీడ్ లైఫ్ అని విష్ చెయ్ అని కాంచన అంటుంది. ఎక్కడ మళ్ళీ కార్తీక్ తో గొడవపడుతుందోనని మేమ్ గుడికి వెళ్తున్నామంటూ ఫోన్ కట్ చేస్తుంది.
చూసావా ఇంట్లో వాళ్ళకే కాదు అత్త కి కూడా చులకన అయ్యానని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఆ దీప అందరిని మార్చేసింది. అది ఉండగా మనం అనుకున్నదేది జరగదు. ముందు నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళమని పారిజాతం అనగానే.. వాళ్లు గుడికి వెళ్లారని జ్యోత్స్న అంటుంది. అక్కడికి వెళ్తానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. దీప, కార్తీక్ లు ప్రదక్షిణలు చేస్తారు. ఇద్దరు ఒకేసారి గంట కొడతారు. దాని తర్వాత శౌర్యని ఎత్తుకొని గంట కొట్టిస్తారు. ఈ శౌర్యా నా కొడుకు కోడల్ని కలుపుతుందని కాంచన అనుకుంటుంది. ఆ తర్వాత మొక్కుబడి దారం దీపకి కాంచన ఇచ్చి మొక్కు చెల్లించుకొని రా అంటుంది. దాంతో దీప వెళ్లి మొక్కు చెల్లిస్తుంది. తాళిని మొక్కుతుంటే కార్తీక్ దూరం నుండి చూసి మురిసిపోతుంటాడు.
ఆ తర్వాత చీరకట్టులో జ్యోత్స్న రెడీ అవుతుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నేను గుడికి వెళ్తున్నాను.. ఇంట్లో మేనేజ్ చెయ్ అంటు జ్యోత్స్న వెళ్ళిపోతుంది. గుడికి వెళ్ళకు.. ఎందుకు వచ్చావంటూ కార్తీక్ కోప్పడతాడు. మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతానని జ్యోత్స్న అనగానే.. ఉండనివ్వని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప బాధపడేలా బావ బర్త్ డే కి నాకు ఈ నెక్లెస్ ఇచ్చాడని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read